ఇంగ్లండ్ చరిత్ర సృష్టిస్తుందా?

22 Jul, 2016 14:43 IST|Sakshi
ఇంగ్లండ్ చరిత్ర సృష్టిస్తుందా?

తొలి టెస్టులో పాకిస్తాన్ చేతిలో 75 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టుకే సిరీస్ నెగ్గే అవకాశాలున్నాయని చరిత్ర చెబుతోంది. మరోవైపు ఆన్ లైన్ సర్వేలో ఇంగ్లండ్ కు 50 శాతం, పాక్ జట్టుకు 26 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయని.. రెండో టెస్ట్ డ్రా అవుతుందని 24శాతం ఓట్లు పోలయ్యాయి. స్టీవ్ ఫిన్, జేక్ బాల్ తొలి టెస్టు ఓటమికి మూల్యాన్ని చెల్లించుకున్నారు. నేటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా లార్డ్స్ టెస్టుకు దూరంగా ఉన్న పేసర్ జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ కు అవకాశం ఇచ్చారు. లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ కు ఛాన్స్ ఇస్తే టెస్టుల్లో అతడికిదే తొలి మ్యాచ్ కానుంది.

2014లో లార్డ్స్ లో టీమిండియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్ తర్వాత పుంజుకుని  3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ లో మొదట లార్డ్స్ లో ఓడిన ఇంగ్లండ్ చివరకు 3-2తో సిరీస్ నెగ్గి ఆసీస్ కు షాకిచ్చిన విషయం తెలిసిందే. తొలిటెస్టులో లార్డ్స్ మైదానంలో పాక్ చేతిలో పరాభవం పొందిన ఇంగ్లండ్ మరోసారి చరిత్ర తిరగరాస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు