అండర్సన్‌.. ఎంతైనా నీకు నువ్వే సాటి

2 Jul, 2020 11:03 IST|Sakshi

లండన్‌ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ సహా అన్ని రకాల ఆటలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమైన ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇందులో క్రికెట్‌కు కూడా మినహాయింపు లేదనే చెప్పొచ్చు. ఇంతకుముందులా బ్యాట్స్‌మన్‌ ఔట్‌ ఐతే ఆటగాళ్లంతా ఒకదగ్గర చేరి అభినందించుకునేది కూడా చూడకపోవచ్చు. తాజాగా అలాంటి సన్నివేశాలే ఇంగ్లండ్‌ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్నాయి. ('ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు')

కరోనా విరామం తర్వాత జూలై 8 నుంచి ఇంగ్లండ్‌- విండీస్‌ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది. సౌతాంప్టన్‌ వేదికగా జూలై 8న ఇరు జట్ల మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు టీమ్‌ బట్లర్‌, టీమ్‌ స్టోక్స్‌గా విడిపోయి అగాస్ బౌల్ మైదానంలో మూడు రోజలు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్నారు. డే 1 ఆటలో భాగంగా టీమ్‌ స్టోక్స్‌ తరపున ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ హైలట్‌గా నిలిచాడు. మొదటిరోజు ఆటలో భాగంగా ఎక్కువ ఓవర్లు వేసిన అండర్సన్‌ ఓవర్‌కు 3 పరుగులు మాత్రమే ఇస్తూ రెండు కీలక వికెట్లు కూడా తీశాడు. అండర్సన్‌ మ్యాచ్‌ మధ్యలోనూ తన చర్యలతో ఆకట్టుకున్నాడు. అండర్సన్‌ తన బౌలింగ్‌లో వికెట్‌ పడినప్పుడు సహచర ఆటగాళ్ల వద్దకు వెళ్లి ఎలాంటి హగ్స్‌, చేతులు కలపడం వంటివి లేకుండా కేవలం భుజాలతోనే అభినందించుకున్నారు. అంతేగాక ఆటగాళ్లంతా భౌతిక దూరం పాటించడం విశేషం. మ్యాచ్‌ మధ్యలో అప్పుడప్పుడు మైదానం నలువైపులా ఏర్పాటు చేసిన సానిటైజర్స్‌ను ఉపయోగిస్తూ కనిపించాడు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వీడియోతో పాటు ఫోటలోను రిలీజ్‌ చేయడంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐసీసీ విధించిన గైడ్‌లైన్స్‌ పాటిస్తూనే ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను కొనసాగించినట్లు ట్విటర్‌లో ఈసీబీ తెలిపింది.

కాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ బట్లర్‌ జట్టు మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 287 పరుగులు చేసింది. కాగా విండీస్‌తో ఈ నెల 8న మొదలయ్యే మొదటి టెస్ట్‌కు రెగుల్యర్ కెప్టెన్ జో రూట్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇంగ్లండ్ బోర్డు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీని అప్పగించింది. జోస్ బట్లర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రూట్ భార్య వచ్చే వారం తమ రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం జట్టుతో కలిసున్న రూట్ నేడు నేడు ట్రైనింగ్ క్యాంప్ వదిలి వెళ్లనున్నాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్ తమలో తాము ఆడే వామప్‌తో పాటు ఫస్ట్ టెస్ట్‌కు దూరం కానున్నాడు. సెకండ్ టెస్ట్‌కు తిరిగి జట్టుతో కలుస్తాడు.

మరిన్ని వార్తలు