జపాన్‌ ఓపెన్‌: శ్రీకాంత్, సమీర్‌ ఔట్‌

24 Jul, 2019 22:31 IST|Sakshi

సింధు ముందంజ

జపాన్‌ ఓపెన్‌

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్, సమీర్‌ వర్మ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. బుధవారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–13, 11–21, 20–22తో మనదేశానికే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చేతిలో పోరాడి ఓడాడు. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో తొలి సెట్‌ను సునాయాసంగా దక్కించుకున్న శ్రీకాంత్‌ రెండో సెట్‌ను అలాగే జారవిడుచు కున్నాడు. నిర్ణయాత్మక మూడోసెట్‌లో పోరాడినప్పటికీ కీలకదశలో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ సమీర్‌ వర్మ 17–21, 12–21తో ఆండర్స్‌ ఆంటోన్సెన్‌(డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 11–21, 14–21తో జెంగ్‌ సి వీ– హువాంగ్‌ యా క్వియాంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి– చిరాగ్‌ షెట్టి ద్వయం 21–16, 21–17తో మార్కస్‌ ఎల్లిస్‌– క్రిస్‌ లాంగ్రిడ్జ్‌(ఇంగ్లండ్‌)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. 

సింధు అలవోకగా...
మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు అలవోకగా రెండో రౌండ్‌లో ప్రవేశించింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21–9, 21–17తో వరల్డ్‌ నెం.12 యూ హాన్‌(చైనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ ఆరంభంలో 0–2తో వెనకబడిన సింధు ఆ తర్వాత వరుసగా 6 పాయింట్లు సాధించి 6–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే ఊపులో ప్రత్యర్థికి కేవలం మరో మూడు పాయింట్లు మాత్రమే కోల్పోయి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సింధుకు ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అనుభవాన్ని రంగరించిన సింధు సెట్‌తోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. తదుపరి రౌండ్‌లో అయ ఒహొరి(జపాన్‌)తో సింధు తలపడుతుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి..

గర్జించిన బెంగాల్‌‌.. కుదేలైన యూపీ

‘సారథిగా తప్పుకుంటే నీకే మంచిది’

ఆర్చర్‌.. టైమ్‌ మిషన్‌ ఉందా ఏందీ?

సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌

అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

రోహిత్‌ ఒకే ఒక్కడు..

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌ 

ఆ షూస్‌ ధర రూ. 3 కోట్లు!

సచిన్‌నే తికమక పెట్టిన ఘటన!

ఫైనల్లో లార్డ్స్, కేంద్రీయ విద్యాలయ 

సత్తా చాటిన హైదరాబాద్‌ సెయిలర్స్‌

కోహ్లి ఒక్క పోస్ట్‌కు రూ.కోటి!

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

ఎందుకలా..?: గంగూలీ ఆశ్చర్యం

భారత క్రికెటర్ల సంఘం కూడా...

నరైన్, పొలార్డ్‌లకు పిలుపు

మిఠాయిలు, మసాలాలు వద్దే వద్దు..

ఐర్లాండ్‌కు సువర్ణావకాశం

క్వార్టర్స్‌లో హుసాముద్దీన్‌

సాయిప్రణీత్‌  శుభారంభం 

వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

నాకొద్దు.. అతడికే ఇవ్వండి: స్టోక్స్‌

టెస్ట్‌ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!

అలిసన్‌ స్టెప్పేస్తే.. సానియా ఫిదా

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

అందుకే రిటైర్మెంట్‌పై ధోని వెనకడుగు!

టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!