బుమ్రాకు ప్రతిష్టాత్మక పురస్కారం

25 Oct, 2019 18:09 IST|Sakshi

టీమిండియా స్పీడస్టర్‌ జస్ప్రిత్‌ బుమ్రా , బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధాన ప్రతిష్టాత్మక విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం ఐదుగురికి ఈ పురస్కారం లభించగా అందులో ఇద్దరు భారతీయులు ఉండడం విశేషం. మిగతవారిలో ఫఖర్‌ జమాన్ (పాకిస్తాన్‌)‌, దిముత్‌ కరుణరత్నే (శ్రీలంక), రషీద్‌ ఖాన్‌(అప్ఘనిస్తాన్‌) లకు పురస్కారం వరించింది.  ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మాయంక్‌ అగర్వాల్‌కు కూడా అరుదైన గౌరవం దక్కింది. 2019-2020కి గానూ 7వ విజ్డెన్‌ వార్షిక పబ్లికేషన్‌లో మయాంక్‌ కథనాలు ప్రచురితమయ్యాయి.

కాగా, విజ్డెన్‌ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచారు. ఇంతకు ముందు మాజీ కెప్టెన్‌ మిథాలిరాజ్‌, దీప్తి శర్మ ఈ ఘనతను  సాధించారు. అలాగే దిగ్గజ ఆటగాళ్లైన గుండప్ప విశ్వనాథ్‌, లాలా అమర్‌నాథ్‌లు విజ్డెన్‌ ఇండియా హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు. 

మరిన్ని వార్తలు