ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను: బుమ్రా

3 Apr, 2020 17:21 IST|Sakshi

టీమిండియా స్టార్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో అతడి బౌలింగ్‌ యాక్షన్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా అతడి బౌలింగ్‌ యాక్షన్‌ను చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేకమంది అనుకరించే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన బౌలింగ్‌ను అనుకరించిన 15 నెలల పాపకు పెద్ద ఫ్యాన్‌ అయ్యానని పేర్కొంటూ బుమ్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన కూతురు సమైరాతో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ సమయంలో రోహిత్‌ సతీమణి రితికా బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడని సమైరాను అడిగింది. దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్‌, రితికాలు గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియోను బుమ్రా తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను’అని పేర్కొన్నాడు. ఇక కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా ఆటగాళ్లు లైవ్‌చాట్‌లో కలుసుకుంటున్నారు. రోహిత్‌-బుమ్రా, కోహ్లి-పీటర్సన్‌లు లైవ్‌చాట్‌లో అనేక విషయాలు ముచ్చటించుకున్న విషయం తెలిసిందే. 


చదవండి:
ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?
యువీ, భజ్జీ.. సాయం చేయండి: మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు