బుమ్రా స్టన్నింగ్‌ యార్కర్‌.. ఐసీసీ ఫిదా..!

29 May, 2019 19:04 IST|Sakshi

కార్డిఫ్‌: బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన రెండో సన్నాహక మ్యాచ్‌లోభారత్ సత్తా చాటింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ (99 బంతుల్లో 108; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని (78 బంతుల్లో 113; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకాలు బాదడంతో టీమిండియా 95 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా 49.3 ఓవర్లలో 264 పరుగులకే  ఆలౌటై పరాజయం పాలైంది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌

ఇక ఐదు ఓవర్లే వేసిన జస్ప్రీత్‌ బుమ్రా (2/25) పదునైన బంతులతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. పదో ఓవర్‌ నాలుగో బంతికి ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (25)ను ఔట్‌ చేసి బంగ్లాను దెబ్బకొట్టిన బుమ్రా.. తదుపరి బంతికే షకీబుల్‌ హసన్‌ (0)ను గోల్డెన్‌ డక్‌గా వెనక్కి పంపాడు. గంటకు 141 కి.మీ వేగంతో దూసుకొచ్చిన యార్కర్‌ను షకీబ్‌ ఎదుర్కోలేకపోయాడు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి స్టంప్స్‌ను నేలకూల్చింది. ఈ యార్కర్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ నిర్వాహకులు ‘అద్భుతమైన డెలివరీ’ అంటూ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు