బుమ్రా..వాట్‌ ఏ స్పెల్‌

5 Jun, 2019 16:40 IST|Sakshi

సౌతాంప్టాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తనమార్కు బౌలింగ్‌ను రుచి చూపించాడు. సఫారీ ఓపెనర్లు హషీమ్‌ ఆమ్లా(6), డీకాక్‌(10)లను పెవిలియన్‌కు చేర్చి ఆ జట్టకు ఆదిలోనే షాకిచ్చాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో నాల్గో ఓవర్‌ రెండో బంతికి ఆమ్లాను ఔట్‌ చేసిన బుమ్రా..ఆరో ఓవర్‌ ఐదో బంతికి డీకాక్‌ను పెవిలియన్‌కు పంపాడు. రోహిత్‌ శర్మ స్లిప్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఆమ్లా ఇన్నింగ్స్‌ ముగియగా, కోహ్లి స్లిప్‌ క్యాచ్‌ పట్టడంతో డీకాక్‌ ఔటయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  దీనిపై భారత మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ వాట్‌ ఏ స్పెల్‌ బుమ్రా’ అంటూ కొనియాడాడు.
(ఇక్కడ చదవండి: బుమ్రా ‘బోణీ’ చేశాడు..!)

అదే సమయంలో ఈసారి డీకాక్‌పై బుమ్రా ఎటువంటి దయ చూపించలేదని ట్వీట్‌ చేశాడు. ‘23 రోజులు రోజుల క్రితం(ఐపీఎల్‌లో బుమ్రా, డీకాక్‌లు ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కావడంతో) డీకాక్‌పై బుమ్రాకు ఎంతో కొంత జాలి ఉండటంతో పాటు వారిద్దరి మధ్య సంబంధం బాగుండేది. కానీ ఈ రోజు డీకాక్‌పై ఎటువంటి జాలి చూపించలేదు. వాట్‌ ఏ స్పెల్‌ బుమ్రా’ అంటూ ట్వీట్‌లో సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. తొలి స్సెల్‌లో బుమ్రా ఐదు ఓవర్లు వేసి రెండు వికెట్లు సాధించడమే కాకుండా 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మరిన్ని వార్తలు