విజేతలు జతిన్, నిఖిత

30 Jul, 2018 10:06 IST|Sakshi

ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్, ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో జతిన్‌దేవ్, కార్తీక్, నిఖిత, భవిత విజేతలుగా నిలిచారు. క్యాడెట్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో జతిన్‌ దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌) 1–6, 11–6, 13–11, 11–3తో పార్థ్‌ భాటియా (ఏడబ్ల్యూఏ)పై గెలిచి  టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సెమీఫైనల్లో జతిన్‌ 11–5, 11–7, 11–3, 11–3తో అరుష్‌ (ఏపీజీ)పై; పార్థ్‌ భాటియా 11–7, 11–7, 11–6, 11–5తో ఎ. మహేశ్‌ (జీటీటీఏ)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు.

సబ్‌ జూనియర్‌ బాలుర విభాగం ఫైనల్లో ఎస్‌ఎస్‌కే కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 11–4, 11–6, 12–10, 11–9తో కేశవన్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో కేశవన్‌ 11–5, 11–6, 11–7, 7–11, 7–11, 11–3తో ప్రణవ్‌ నల్లారి (ఏడబ్ల్యూఏ)పై; కార్తీక్‌ 11–5, 11–7 11–4, 11–7తో యశ్‌ చంద్ర (ఏడబ్ల్యూఏ)పై గెలిచి ఫైనల్‌కు చేరారు.  

క్యాడెట్‌ బాలికల విభాగం ఫైనల్లో హెచ్‌ఎస్‌ నిఖిత (వీపీజీ) 11–5, 11–6, 11–5, 11–8తో కావ్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో నిఖిత 11–4, 11–3, 11–6, 11–6తో సమీక్ష రెడ్డి (ఎన్‌ఎల్‌జీ)పై; కావ్య 11–5, 11–1, 10–12, 11–2, 11–8తో జలని (వీపీజీ)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించారు. సబ్‌ జూనియర్‌ బాలికల ఫైనల్లో ఎన్‌. భవిత (జీఎస్‌ఎమ్‌) 11–5, 11–4, 11–5, 11–4తో విధి జైన్‌ (జీఎస్‌ఎమ్‌)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీఫైనల్లో విధిజైన్‌ 11–9, 11–8, 11–9, 11–5తో కె. ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై; భవిత 11–3, 11–4, 11–5, 11–4తో ప్రియాంషి (జీఎస్‌ఎమ్‌)పై గెలిచి ఫైనల్‌ చేరారు.

ఇతర విభాగాల మ్యాచ్‌ల వివరాలు

జూనియర్‌ బాలుర క్వార్టర్‌ ఫైనల్స్‌: సాయినాథ్‌ రెడ్డి (ఎంఎల్‌ఆర్‌) 11–5, 5–11, 12–10, 11–6, 11–8తో అమన్‌ (ఏవీఎస్‌సీ)పై, వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ) 11–5, 11–9, 11–8, 11–5తో బి. వత్సిన్‌ (ఏడబ్ల్యూఏ)పై, కేశవన్‌ (ఎంఎల్‌ఆర్‌) 14–12, 11–7, 11–3, 9–11, 11–9తో కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ)పై, అద్వైత్‌ (ఏడబ్ల్యూఏ) 9–11, 10–12, 11–5, 11–8, 11–5, 12–10తో యశస్విన్‌ (జీఎస్‌ఎమ్‌)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టారు.  

యూత్‌ బాలుర క్వార్టర్‌ ఫైనల్స్‌: కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 14–12, 12–10, 9–11, 12–10, 11–7తో సాయినాథ్‌ రెడ్డి (ఎంఎల్‌ఆర్‌)పై; పియూష్‌ అగర్వాల్‌ 11–5, 12–14, 11–4, 5–11, 11–7, 12–10తో సరోజ్‌ సిరిల్‌పై, అరవింద్‌ (ఏడబ్ల్యూఏ) 2–11, 11–8, 12–10, 13–11, 12–14, 11–6తో వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ)పై గెలిచి సెమీస్‌ చేరారు.

పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌: మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) 11–8, 12–10, 11–8, 10–12, 11–6తో అలీ మొహమ్మద్‌పై, అమన్‌ 7–11, 11–8, 4–11, 11–5, 9–11, 11–5, 12–10  తో చంద్రచూడ్‌ (ఎంఎల్‌ఆర్‌)పై గెలిచారు.  

జూనియర్‌ బాలికల క్వార్టర్‌ ఫైనల్స్‌: ఎన్‌. భవిత (జీఎస్‌ఎమ్‌) 9–11, 6–11, 11–1, 8–11, 11–7, 11–8, 11–6తో జె. వినిచిత్ర (జీఎస్‌ఎమ్‌)పై, టి. రమ్య 8–11, 11–8, 11–5, 11–8, 11–8తో ప్రియాన్షి (జీఎస్‌ఎమ్‌)పై విజయం సాధించారు.  

యూత్‌ బాలికల క్వార్టర్‌ ఫైనల్స్‌: వి. లాస్య (ఏడబ్ల్యూఏ) 11–4, 11–3, 11–6, 9–11, 11–7తో ఐశ్వర్య (ఏడబ్ల్యూఏ)పై, ప్రణీత (హెచ్‌వీఎస్‌) 11–4, 11–8, 11–5, 11–5తో హనీఫా ఖాతూన్‌ (వీపీజీ)పై, వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎమ్‌) 11–6, 11–3, 11–3, 11–4తో రమ్యపై గెలిచారు.  

మహిళల క్వార్టర్‌ ఫైనల్స్‌: నిఖ్ఖత్‌ బాను (ఆర్‌బీఐ) 11–8, 11–5, 11–8, 11–9తో పలక్‌ షా (ఏవీఎస్‌సీ)పై, వరుణి జైస్వాల్‌ 6–11, 12–10, 12–10, 11–9, 11–8తో మౌనిక (జీఎస్‌ఎమ్‌)పై విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు