ఐపీఎల్‌ వేలంలో పెను సంచలనం

28 Jan, 2018 17:58 IST|Sakshi
జయదేవ్‌ ఉనాద్కత్‌(ఫైల్‌ఫొటో)

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌కు సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న వేలంలో పెను సంచలనం నమోదైంది. సౌరాష్ట్ర పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ రూ. 11.50 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ కు ప్రాతినిథ్యం వహించి బౌలింగ్‌లో సత్తాచాటిన ఉనాద్కత్‌కు ఈసారి వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించి రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. ఉనాద‍్కత్‌కు కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ అతన్ని దక్కించుకుంది.

అతని కనీస ధర రూ. 1.50 కోట్లు ఉండగా, అంతకు 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఆటగాడిగా ఉనాద్కత్‌ నిలిచాడు. బెన్‌ స్టోక్స్‌(12.5 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడు కాగా, ఆ తర్వాత స్థానంలో ఉనాద్కత్‌ నిలిచాడు. అయితే భారత్ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాడు ఉనాద్కత్‌ కావడం మరో విశేషం.

మరొకవైపు హైదరాబాద్‌ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌ వేలంలో ఫర్వాలేదనిపించాడు. అతని కనీస ధర రూ. కోటి ఉండగా, రూ. 2.60 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.  ఇక కౌల్టర్‌ నైల్‌ రూ. 2.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, పేసర్‌ వినయ్‌ కుమార్‌ను రూ. 1 కోటి వెచ్చించి కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..

ధోని ఆర్మీ ట్రైనింగ్‌.. గంభీర్‌ కామెంట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

మహ్మద్‌ ఆమిర్‌ సంచలన నిర్ణయం

మరో ప్రాణం తీసిన బాక్సిం‍గ్‌ రింగ్‌

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

మళ్లీ యామగుచి చేతిలోనే..

అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!

మళ్లీ బ్యాట్‌ పట్టిన యువరాజ్‌ సింగ్‌

సాయి ప్రణీత్‌ కొత్త చరిత్ర

ఇక టాప్‌-5 జట్లకు అవకాశం!

‘ఆమ్రపాలి’ గ్రూప్‌ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!

రాణించిన లీచ్, రాయ్‌

మన్‌ప్రీత్, శ్రీజేష్‌లకు విశ్రాంతి

అగ్రస్థానంలో విజయ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ జట్ల ప్రకటన

ధోని.. సైన్యంలో చేరిపోయాడు

క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

సింగమలింగై

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

ఒప్పొందం నుంచి తప్పుకుంది

తలైవాస్‌ చేజేతులా..

టీమిండియా కోచ్‌ రేసులో అతడు కూడా..

ధోని ఆర్మీ సేవలు కశ్మీర్‌ లోయలో!

టీమిండియాతో ఒప్పో కటీఫ్‌!

గంగూలీ వాదనకు కాంబ్లీ నో!

‘కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించండి’

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

క్వార్టర్స్‌కు సింధు, ప్రణీత్‌

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపికపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!