పంత్‌కు పాఠాలు నేర్పిస్తున్న జీవా

11 May, 2019 20:55 IST|Sakshi

భారత క్రికెట్ మాజీ సారథి, మహేంద్ర సింగ్ ధోనీ గారాల కూతురు జీవాకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ముద్దు ముద్దు మాటలతో కోట్ల మందిని తన అభిమానులుగా మార్చేసుకుంది జీవా ధోనీ. తాజాగా జీవా ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జీవా హిందీ నేర్పిస్తూ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు