జీల్, సచిన్‌లకు స్వర్ణాలు

25 Jul, 2017 10:39 IST|Sakshi
జీల్, సచిన్‌లకు స్వర్ణాలు

కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌

నసావు (బహమాస్‌): పతకాల వేటను పసిడితో మొదలుపెట్టిన భారత క్రీడాకారులు స్వర్ణ పతకంతోనే ముగించారు. కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటుకున్నారు. బహమాస్‌లో ముగిసిన ఈ ఆరు రోజుల క్రీడల్లో భారత్‌ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్‌ దేశాయ్‌ బాలికల సింగిల్స్‌ విభాగంలో స్వర్ణం సాధించగా... బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్‌ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో జీల్‌ దేశాయ్‌–సిద్ధాంత్‌ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్స్‌ ఫైనల్లో జీల్‌ దేశాయ్‌ 6–3, 7–6తో ఎలీజా ఒమిరూ (సైప్రస్‌)ను ఓడించగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో జీల్‌–సిద్ధాంత్‌ జంట 6–4, 6–3తో నియోస్‌–ఒమిరూ (సైప్రస్‌) జోడీపై గెలిచింది. కాంస్య పతక పోరులో సిద్ధాంత్‌ 6–2, 6–0తో నియోస్‌ (సైప్రస్‌)పై నెగ్గాడు. ఇక బాక్సింగ్‌లో సచిన్‌ సివాచ్‌ (49 కేజీలు) స్వర్ణం దక్కించుకోగా... మొహమ్మద్‌ ఎతాష్‌ ఖాన్‌ (56 కేజీలు) కాంస్యం... బాలికల ఈవెంట్‌లో జానీ (60 కేజీలు) రజతం, ఏక్తా (51 కేజీలు) కాంస్యం గెలిచారు. 

>
మరిన్ని వార్తలు