గోల్డెన్‌ జాన్సన్‌

31 Aug, 2018 01:25 IST|Sakshi

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగిన పురుషుల హాకీ జట్టు సెమీస్‌లో ఓడి నిరాశపర్చినా... అదరహో అనేలా సాగిన అథ్లెట్ల ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో గురువారం మరిన్ని పతకాలు చేరాయి. 1500 మీ. పరుగులో జిన్సన్‌ జాన్సన్‌ మ్యాజిక్‌... మహిళల రిలేలో సాధికార  స్వర్ణం...12వ రోజు విశేషాలు. పురుషుల రిలే జట్టు రజతంతో సరిపెట్టగా, డిస్కస్‌ త్రోలో నిరాశపర్చిన సీమా కాంస్యంతో సంతృప్తి పడింది. 1500 మీ. పరుగులో చిత్రా మరో కాంస్యం అందించింది. అథ్లెటిక్స్‌లో... ఓవరాల్‌గా భారత అథ్లెట్లు ఈ ఏషియాడ్‌లో 7 స్వర్ణాలు, 10 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గి సత్తా చాటారు. బుధవారం నాటికి మొత్తం 11 స్వర్ణాలు సాధించి గత క్రీడల స్వర్ణాలను సమం చేసిన భారత్‌ ఖాతాలో గురువారం మరో రెండో పసిడి పతకాలు చేరాయి.  అన్నీ కలిపి ఇప్పటికే 59 పతకాలు రావడంతో 2014 ఏషియాడ్‌ (57 పతకాలు) లెక్కలనూ భారత్‌ అధిగమించింది. 

జకార్తా: మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ జిన్సన్‌ జాన్సన్‌ మళ్లీ మెరిశాడు. గురువారం ఆసియా క్రీడల 1500 మీ. పరుగులో స్వర్ణం ఒడిసిపట్టాడు. రెండు రోజుల క్రితం జరిగిన 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్‌... ఈసారి మాత్రం పట్టువిడవలేదు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. ఇరాన్‌కు చెందిన అమిర్‌ మొరాడీ (3 నిమిషాల 45.62 సెకన్లు) రజతం, బహ్రెయిన్‌ అథ్లెట్‌ మొహమ్మద్‌ టియోలీ (3 నిమిషాల 45.88 సెకన్లు) కాంస్యం నెగ్గారు. అయితే 800 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చిన భారత్‌ అథ్లెట్‌ మన్‌జీత్‌ సింగ్‌... 1500 మీ. ఈవెంట్‌లో పతకం చేజార్చుకున్నాడు. 3 నిమిషాల 46.57 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దక్షిణాఫ్రికా గెలుపు

సెలెక్టర్లకు బీసీసీఐ  రూ.20 లక్షల నజరానా

క్విటోవా హవా

రొనాల్డోకు   రూ.152 కోట్ల జరిమానా

కాచుకో కివీస్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం

ఆస్కారం  ఎవరికి?

టీజర్‌  ఫ్రెష్‌గా  ఉంది – డి. సురేశ్‌బాబు