ధ్యాన్‌చంద్‌కూ ‘భారతరత్న’!

4 Dec, 2013 01:11 IST|Sakshi
ధ్యాన్‌చంద్‌కూ ‘భారతరత్న’!

 సంగ్రూర్ (పంజాబ్): ప్రతిష్టాత్మక పౌరపురస్కారం ‘భారతరత్న’ను హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కూ ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. ఇక్కడి వార్ హీరోస్ స్టేడియంలో రూ. 6.87 కోట్లతో నిర్మించనున్న సింథటిక్ ట్రాక్  శంకుస్థాపన కోసం వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
 
 వచ్చే ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లు భారత జాతీయ జెండా కిందనే పోటీల్లో పాల్గొంటారన్నారు. బర్నాలలోని ఎస్‌డీ కాలేజి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలున్న ఇలాంటి సెంటర్లను ప్రతీ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేందుకు మంత్రి చొరవ చూపాలని స్థానిక కాంగ్రెస్ ఎంపీ విజయ్ ఇందర్ సింగ్లా కోరారు.
 

>
మరిన్ని వార్తలు