జీతూ రాయ్‌కి రజతం

12 Jun, 2014 01:59 IST|Sakshi
జీతూ రాయ్‌కి రజతం

ప్రపంచకప్ షూటింగ్
 మ్యూనిచ్: భారత నంబర్‌వన్ పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్‌లో రజత పతకం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ 199.4 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు.
 
  స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా 201.3 స్కోరుతో స్వర్ణం గెలుచుకోగా, ఉక్రెయిన్ షూటర్ పావ్లో కొరోస్టయిలోవ్ కాంస్యం దక్కించుకున్నాడు. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ క్వాలిఫయింగ్స్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ 8వ స్థానం పొందాడు.
 

మరిన్ని వార్తలు