స్మిత్‌ రాణించినా... ఇంగ్లండ్‌దే పైచేయి

14 Sep, 2019 02:23 IST|Sakshi

ఆరు వికెట్లు తీసిన ఆర్చర్‌

యాషెస్‌ ఐదో టెస్టు

లండన్‌: అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మాజీ కెపె్టన్‌ స్టీవ్‌ స్మిత్‌ (145 బంతుల్లో 80; 9 ఫోర్లు, సిక్స్‌) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడినా యాషెస్‌ సిరీస్‌ ఐదో టెస్టులో ఆ్రస్టేలియా వెనుకబడింది. ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 69 పరుగుల ఆధిక్యం దక్కింది. శుక్రవారం ఓవర్‌నైట్‌ స్కోరు 271/8తో ప్రారంభమైన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 294 పరుగుల వద్ద ముగిసింది. మిచెల్‌ మార్‌‡్ష (5/46) ఐదు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియాను పదునైన బంతులతో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/62) వణికించాడు.  లబషెన్‌ (48; 10 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించి స్మిత్‌ జట్టును నిలబట్టే ప్రయత్నం చేశాడు. యాషెస్‌లో వరుసగా పదో అర్ధ సెంచరీ సాధించాడు. కరన్‌ (3/46) సైతం ప్రతాపం చూపడంతో ఆసీస్‌ ఎక్కువసేపు పోరాడలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ వికెట్లేమీ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు