రణ్‌వీర్‌ డ్రెడ్‌లుక్‌ ఫొటో షేర్‌ చేసిన జాన్‌సెనా

30 May, 2020 20:21 IST|Sakshi

రెజ్లింగ్ స్టార్‌‌ జాన్‌సెనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతోంది. రణ్‌వీర్‌ డ్రిడ్‌లుక్‌(చెట్టు వేళ్లలా తలపై జుట్టు ఇరుపైపులా వేలాడుతూ ఉండటం)తో ఉన్న ఫొటోను జాన్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి ప్రముఖ మాజీ రెజ్లర్‌ స్టార్‌ స్టోన్‌ కోల్డ్‌ స్టీవ్‌ ఆస్టీన్‌ పేరును క్వారంటైన్‌లో ‘కోల్డ్‌ స్టోన్‌ సింగ్‌’ అంటూ ఫొటోపై రాసి పోస్టు చేశాడు. ఇది చూసిన రణ్‌వీర్‌ హహ్హాహ్హా... అంటూ స్మైలీ ఎమోజీకి చేతులు కట్టుకుని ఉన్న ఎమోజీని జత చేసి కామెంట్‌ చేశాడు. 

A post shared by John Cena (@johncena) on

కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన మరోసారి పోడగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లాక్‌డౌన్‌ నా రూపం చూడండి అంటూ డ్రిడ్‌లుక్‌తో ఉన్న ఫొటోను ఇటీవల షేర్‌ చేసిన విషయ తెలిసిందే. కాగా వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ టైటిల్‌ను జాన్‌సెనా 16 సార్లు గెలుచుకున్న అతడు రెజ్లింగ్‌మానియా 36 ఇంతవరకు రింగ్‌లో పోరాడలేదు. ఫైర్‌ప్లె ఫన్‌ హౌజ్‌ మ్యాచ్‌లో ది ఫైండ్‌ గా ప్రసిద్దీ చెందిన బ్రే వ్యాట్‌తో రింగ్‌లో తలపడి గెలిచాడు. 

మరిన్ని వార్తలు