కోహ్లి రికార్డులను అందుకుంటా..

19 Mar, 2019 19:24 IST|Sakshi

హైదరాబాద్ ‌: ప్రస్తుత క్రికెట్‌లో అత్యంత గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఖ్యాతి గండించిన ఆటగాడు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన కోహ్లి పరగుల వరద పారిస్తున్నాడు. ఎన్నో రికార్డులు.. మరెన్నో అవార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే కోహ్లి రికార్డులపై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కన్నేశాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లిని అందుకుంటానని ఈ ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు అత్యున్నత శిఖరాలను అవరోధించకూడదని కోరుకుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో కోహ్లి అత్యున్నత శిఖరంలో ఉన్నాడని.. ఆ శిఖరాన్ని అందుకోవడమే తన కర్తవ్యమని పేర్కొన్నాడు.
ఇక ఇప్పటివరకు 227 వన్డేలు ఆడిన కోహ్లి 41 సెంచరీలు, 49 అర్ధసెంచరీల సహాయంతో 10,843 పరుగులు సాధించాడు. ప్రతిష్టాత్మక విదేశీ టెస్టులపై ఫోకస్‌ పెట్టిన కోహ్లి.. 2016 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. లేకుంటే వన్డేల్లో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేవాడు. ఇక 28 ఏళ్ల బట్లర్‌ 126 వన్డేల్లో ఏడు సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 3387 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో బట్లర్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి రాజస్తాన్‌ రాయల్స్‌కు అపూర్వ విజయాలు అందించాడు.  ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిని ఈ ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ 155.24 స్ట్రైక్‌ రేట్‌తో 548 పరగులు సాధించాడు.
(ధోని లేకుంటే కోహ్లి డమ్మీనే!)

మరిన్ని వార్తలు