ఇంగ్లండ్‌ ఎదురీత: ప్రస్తుతం 200/5

7 Sep, 2019 06:14 IST|Sakshi

బర్న్స్, రూట్‌ అర్ధ సెంచరీలు  

మాంచెస్టర్‌: యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరును అందుకునేందుకు ఇంగ్లండ్‌ ఆపసోపాలు పడుతోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మరో 297 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 23/1తో శుక్ర వారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌... వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి 200/5తో నిలిచింది. నైట్‌ వాచ్‌మన్‌ ఓవర్టన్‌ (5) త్వరగానే ఔట్‌ కాగా, ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (81; 9 ఫోర్లు), కెప్టెన్‌ జో రూట్‌ (71; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆదుకునే ప్రయత్నం చేశారు. పూర్తి సాధికారికంగా ఆడలేకపోయినప్పటికీ ప్రత్య ర్థిది పైచేయి కాకూడదన్నట్లు నిలిచిన వీరు మూడో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. అయితే, వీరిద్దరితో పాటు బట్లర్‌ (23)ను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసిన హాజల్‌వుడ్‌ (4/48) గట్టి దెబ్బకొట్టాడు. ప్రసుత్తం స్టోక్స్‌ (7 బ్యాటింగ్‌), బెయిర్‌స్టో (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   ఇంగ్లండ్‌ ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే మరో 98 పరుగులు చేయాలి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు