1500 టికెట్లే అమ్ముడుపోయాయి!

19 Oct, 2019 03:26 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఏవో కొన్ని ప్రతిష్టాత్మక వేదికల్లో మినహా టెస్టు క్రికెట్‌కు అంతగా ఆదరణ దక్కడం లేదు. క్రికెట్‌ను చిన్న నగరాలకు కూడా చేర్చే ప్రయత్నంలో బీసీసీఐ ఇలాంటి వేదికల్లో టెస్టులు నిర్వహిస్తోంది. అయితే ఏం చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతంత మాత్రమే. తాజాగా రాంచీ టెస్టులో ఇది మళ్లీ నిరూపితమైంది. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా... ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్‌కు 1500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జేఎస్‌సీఏ) ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాగే ఉంటే ఇకపై టెస్టుకు ఆతిథ్యం ఇవ్వడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని జేఎస్‌సీఏ అధ్యక్షుడు నఫీస్‌ ఖాన్‌ అన్నారు. గ్యాలరీలు ఖాళీగా కనిపించకుండా పెద్ద మొత్తంలో కాంప్లిమెంటరీ పాస్‌లు పంపించినా అమ్ముడుపోయిన టికెట్ల విషయంలో మాత్రం తాము తీవ్రంగా నిరాశ చెందామని ఆయన చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌కు 5వేలు, పాఠశాల విద్యార్థుల కోసం మరో 10 వేలు టికెట్లు ఉచితంగా అందిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు