జనవరి 4న లోధా కమిటీ తుది నివేదిక

23 Dec, 2015 01:03 IST|Sakshi

 సుప్రీంకోర్టు, బీసీసీఐకి అందజేయనున్న ప్యానెల్
 న్యూఢిల్లీ:
బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తన తుది నివేదికను జనవరి 4న సుప్రీంకోర్టుకు అందజేయనుంది. కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో పాటు సలహాలు, సూచనలను కూడా కమిటీ ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ మొత్తం నివేదికను కోర్టుతో పాటు బీసీసీఐకి కూడా అందజేయనుంది.
 
  స్పాట్ ఫిక్సింగ్ కేసులో గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా, చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలకు శిక్ష ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ త్రిసభ్య కమిటీని... బీసీసీఐ పనితీరును కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జూలైలో నివేదికను సమర్పించాలని చెప్పినా... కమిటీ మరింత గడువు కోరడంతో కోర్టు ఈనెల 31 వరకు పొడిగించింది.
 

మరిన్ని వార్తలు