వివాదాలు వద్దు.. ఆ ట్వీట్‌ను తీసేయ్‌!

18 Apr, 2020 14:55 IST|Sakshi

సమైక్యతే మన బలం

బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నేత బబితా ఫోగాట్ చేసిన ట్వీట్‌తో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరూ ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని కొందరు డిమాండ్‌ చేశారు.దీనిపై బబతా స్పందిస్తూ.. తాను ఎవరికీ భయపడనుంటూ స్పష్టం చేశాడు. ఈ ట్వీట్లు చేసిన తర్వాత నుంచి తనను సోషల్ మీడియాలో పలువురు బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. తాను ఏమి తప్పుగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని బాబితా వెల్లడించారు. కాగా,  దీనిపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. (నేనే త‌ప్పూ చేయ‌లేదు: బ‌బితా ఫోగాట్‌)

ఒకవైపు బబితాను కూల్‌గా మందలిస్తూనే ఆ ట్వీట్‌ తొలగించమంటూ విజ్ఞప్తి చేశారు. ‘ సారీ బబితా..  ఈ కరోనా వైరస్‌ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.  మనం స్పోర్ట్స్‌ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్‌ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు’ అని జ్వాల పేర్కొన్నారు. మరొక ట్వీట్‌లో తాను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నానని, అదే సమయంలో తాను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారన్నారు. ప్రతీ ఒక్కరూ తన విజయాన్ని వారి విజయంగానే చూశారన్నారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు’ అని జ్వాల పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు