ఎన్‌కౌంటర్‌పై గుత్తా జ్వాల సూటి ప్రశ్న

6 Dec, 2019 12:45 IST|Sakshi

ప్రతీ రేపిస్ట్‌కు ఇదే శిక్ష అమలు చేస్తారా?

హైదరాబాద్‌: దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు హైదరాబాద్‌ పోలీసుల్ని ప్రశంసించగా, తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సైతం స్పందించారు. ‘  గ్రేట్‌ వర్క్‌ హైదరాబాద్‌ పోలీసు. వుయ్‌ సెల్యూట్‌ యు’ అని సోషల్‌ మీడియాలో కొనియాడారు. ఇక కేంద్ర మాజీ మంత్రి, ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ కూడా హైదరాబాద్‌ పోలీసుల్ని ప్రశంసించారు.  ‘హైదరాబాద్‌ పోలీసులకు ఇవే నా అభినందనలు. పోలీస్‌ పవర్‌ను, నాయకత్వాన్ని చూపెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయం అని దేశ ప్రజలు తెలుసుకోవాలి’ రాథోడ్‌ పేర్కొన్నారు.

ఇక మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన ట్వీటర్‌ అకౌంట్‌లో స్పందిస్తూ తెలంగాణ పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. ‘ భవిష్యత్తులో  అత్యాచార ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతీ రేపిస్టుకు ఇదే తరహా శిక్ష అమలు చేయాలన్నారు. ఎవరైతే సమాజం పట్ల బాధ్యత లేకుండా హత్యాచార ఘటనలకు పాల్పడతారో వారికే ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇకనైనా అత్యాచార ఘటనలకు ముగింపు దొరుకుతుందా. అత్యాచారానికి పాల్పడిన ప్రతీ  ఒక్కర్నీ ఇలానే శిక్షిస్తారా’ ఇదే ‘ముఖ్యమైన ప్రశ్న’ అంటూ జ్వాల ప్రశ్నించారు.

దిశపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. నిందితులను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ జరుపుతున్నప్పుడు పోలీసులుపై దాడి చేశారని, తప్పించుకుని పారిపోతుండగా, పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

ఇక్కడ చదవండి:

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌

దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్‌

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు