ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ

26 Apr, 2017 00:41 IST|Sakshi
ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌కు జ్యోతిక శ్రీ

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇటీవలే జరిగిన జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతిక శ్రీ భారత జట్టులోకి ఎంపికైంది. బ్యాంకాక్‌లో వచ్చే నెల 20 నుంచి 23 వరకు జరిగే ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జ్యోతిక శ్రీ బాలికల 400 మీటర్ల విభాగంలో బరిలోకి దిగుతుంది.

మొత్తం 37 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు పాటియాలా, సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) కేంద్రంలో శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు