భారత టెన్నిస్‌ జట్టులో భువన కాల్వ

21 Nov, 2019 10:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల టెన్నిస్‌ జట్టులో తెలంగాణ క్రీడాకారిణి భువన కాల్వ చోటు దక్కించుకుంది. నేపాల్‌ వేదికగా డిసెంబర్‌ 1 నుంచి 10 వరకు దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి.

ఇందులో భారత్‌తో పాటు మరో ఏడు దేశాలు పాల్గొననున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీల్లో నిలకడగా రాణిస్తోన్న భువన ఈ క్రీడల్లోనూ రాణించాలని పట్టుదలగా ఉంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా