తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా..

22 Sep, 2019 16:33 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో దుమ్ము రేపాడు. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా సెంట్రల్‌ పంజాబ్‌ తరఫున ఆడుతున్న అక్మల్‌.. ఉత్తర పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదేశాడు. దాంతో తన ఫస్ట్‌ కెరీర్‌లో 31వ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ మార్కును  చేరిన తొలి ఆసియన్‌ వికెట్‌ కీపర్‌గా అక్మల్‌ రికార్డు సాధించాడు.

అదే సమయంలో ఓవరాల్‌గా రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక్కడ ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్‌ కంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌ సెంచరీలు చేసిన ఘనతను నమోదు చేశాడు. ఈ జాబితాలో  ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ లెస్‌ ఏమ్స్‌(56) అగ్రస్థానంలో ఉన్నాడు.తన సెంచరీతో సెంట్రల్‌ పంజాబ్‌ 5వికెట్లకు 369 పరుగులతో గౌరవప్రధానమైన స్కోర్‌ సాధించగలిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్‌లేమి కారణంగా సెలక్టర్లు అక్మల్‌కు మొండిచేయి చూపగా దేశవాళీ క్రికెట్‌లో రాణించడం విశేషం. అక్మల్‌ చివరిసారిగా 2010లో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడగా, వన్డేల్లో 2017లో వెస్ట్ండీస్‌తో చివరి వన్డే ఆడాడు.

మరిన్ని వార్తలు