తొలి మ్యాచ్‌కు విలియమ్సన్‌ దూరం!

24 Mar, 2019 01:30 IST|Sakshi

సన్‌రైజర్స్‌ కోచ్‌ టామ్‌ మూడీ వ్యాఖ్య

కోల్‌కతా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తమ జట్టు తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. నేడు కోల్‌కతాలో నైట్‌రైడర్స్‌ జట్టుతో జరుగనున్న మ్యాచ్‌లో విలియమ్సన్‌ అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్‌ కోచ్‌ టామ్‌ మూడీ సందేహం వ్యక్తం చేశారు. భుజం గాయం నుంచి కేన్‌ పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణమన్నారు. మ్యాచ్‌ సమయం వరకు ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ‘భుజం గాయం నుంచి విలియమ్సన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

అదేం సుదీర్ఘ కాలం పాటు వేధించే గాయం కాదు. ఒకవేళ విలియమ్సన్‌ ఆడగలిగే స్థితిలో ఉంటే మ్యాచ్‌ సమయం వరకు తెలుస్తుంది. కొద్దిరోజుల్లోనే సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ ఆడాల్సి ఉంటుంది. విలియమ్సన్‌ ఆడలేని పక్షంలో జట్టుకు ప్రస్తుతం జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న భువనేశ్వర్‌ సారథిగా వ్యవహరిస్తాడు’ అని టామ్‌ మూడీ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడుతోన్న సమయంలో విలియమ్సన్‌ భుజానికి గాయమైంది. ఈనెల 29న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉప్పల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు