‘ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’

15 Jul, 2019 09:00 IST|Sakshi

లండన్‌ : నరాలు తెగే ఉత్కంఠత మధ్య.. క్రికెట్‌ పుట్టినింటికే ప్రపంచకప్‌ చేరింది. మ్యాచ్‌, సూపర్‌ ఓవర్‌ టైగా మారినప్పటికి.. సూపర్‌ ఓవర్‌లో అత్యధిక బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌ వరుసగా రెండో సారి రన్నరప్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ ఓటమితో కివీస్‌ ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందారు. ఓటమిపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ స్పందిస్తూ.. ‘విజేతగా నిలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్‌ టీంకు ధన్యవాదాలు. మ్యాచ్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. పిచ్‌లు మేం అనుకున్నదాని కంటే భిన్నంగా ఉన్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ టైగా మారడం వెనక చాలా కారణాలున్నాయి. ఇది నిజంగా దురదృష్టకరం. మ్యాచ్‌ టైగా మారటంతో మా ఆటగాళ్లు తీవ్రంగా కలత చెందారు. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు’ అన్నారు.

‘ఇది కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదు. మ్యాచ్‌ మొత్తం మీద జరిగిన ప్రతి చిన్న విషయం కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్‌లో చోటు చేసుకున్న కొన్ని అంశాలు న్యూజిలాండ్‌కు దురదృష్టకర పరిణామాలుగా మారాయి. స్టోక్స్‌ ఫోర్‌ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి గప్టిల్‌ త్రో విసిరాడు. అయితే క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును తాకి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీకి వెళ్లిపోయి ఆరు పరుగులు రావడం ఇంగ్లండ్‌కు కలిసివచ్చింది. ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోంది’ అన్నారు విలియమ్సన్‌.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బౌండరీ’కి బదులు రెండో సూపర్‌

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆ ‘స్పెషల్‌’ జాబితాలో రోహిత్‌శర్మ

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

ప్రధానితో ప్రపంచకప్‌ విజేత

ఫైనల్లో పరాజితులు లేరు 

‘అప్పుడు సిక్స్‌తోనే సమాధానం ఉండేది’

వారి నిర్ణయమే ఫైనల్‌: ఐసీసీ

సచిన్‌ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

ఐసీసీ రూల్‌పై ‘బిగ్‌’ పంచ్‌!

ఓవర్‌త్రోను చూసి ఎగిరి గంతులేశాడు!

ఆ సలహానే పని చేసింది: ఆర్చర్‌

ధోని సంగతి తెలీదు కానీ...

అంతా పీడకలలా అనిపిస్తోంది

వీధి రౌడీలా కాదు హీరోలా...

అదృష్టం మా వైపు ఉంది!

ప్రపంచకప్‌ ఫైనల్‌పై స్పందించిన కోహ్లి

వన్డేలకు రోహిత్‌.. టెస్ట్‌లకు కోహ్లి!

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. కోహ్లికి దక్కని చోటు

క్రికెట్‌ రూల్స్‌పై దృష్టి సారించాల్సిందే: రోహిత్‌

‘ధోని రనౌట్‌ పాపమే చుట్టుకుంది’

ట్రోఫీ చేజార్చుకోవడం సిగ్గుచేటు : స్టోక్స్‌ తండ్రి

ఆర్చర్‌కు సూపర్‌ పవర్‌ ఉందా?

ఎట్లిస్తరయ్యా 6 పరుగులు?

అనూహ్యంగా వచ్చాడు.. టాప్‌ లేపాడు!

బెన్‌ స్టోక్స్‌కు అంత సీన్‌ లేదు!

మీరెవరూ క్రీడల్లోకి రాకండి: నీషమ్‌ ఆవేదన

డీఆర్‌ఎస్‌ లేకుంటే బలైపోయేవారే..!

టామ్‌ లాథమ్‌ నయా రికార్డు

హీరో.. విలన్‌.. గప్టిలే!