‘వార్నర్‌ చెడ్డోడేమీ కాదు’

29 Mar, 2018 13:22 IST|Sakshi
కేన్‌ విలియమ్సన్‌(ఫైల్‌ఫొటో)

ఆక్లాండ్‌: ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆసీస్‌ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాసటగా నిలిచాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున వార్నర్ కెప్టెన్సీలో ఆడిన విలియమ్సన్.. వార్నర్‌ స్వతహాగా చెడ్డ వ్యక్తి కాదని స్పష్టం చేశాడు.

క్రికెట్‌ గేమ్‌ను మోసం చేశారంటూ అభిమానులు వార్నర్, స్మిత్‌లను తిడుతున్న తరుణంలో విలియమ్సన్‌. తన సహచరుడు వార్నర్‌కు అండగా నిలిచాడు. 'ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డ వ్యక్తి కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వార్నర్‌ చాలా ఆవేదన చెందాడు. ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత వార్నర్‌తో నేను టచ్‌లోనే ఉన్నాను' అని విలియమ్సన్ తెలిపాడు.

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్‌లపై ఏడాదిపాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)నిషేధించింది. మరొకవైపు బౌలర్‌ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలపాటు వేటు వేసింది. స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను నిషేధం ముగిసిన ఏడాది దాకా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. వార్నర్‌ను జీవితాంతం ఎలాంటి నాయకత్వ బాధ్యతలకు పరిగణనలోకి తీసుకోబోమని సీఏ తేల్చిచెప్పింది.

మరిన్ని వార్తలు