కపిల్‌ ‘సీఏసీ’కి నోటీసు

29 Sep, 2019 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ)కి బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డీకే జైన్‌ శనివారం నోటీసు పంపారు. కపిల్‌ ఆధ్వర్యంలో అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్న సీఏసీ... ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేíసింది. కపిల్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నాడు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యుడు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. వీటిని పేర్కొంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు