స్వర్ణాలతో మెరిసిన కార్తీక్, సాయి

8 Feb, 2018 10:33 IST|Sakshi

 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌’లో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్‌లో హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో హెచ్‌. కార్తీక్, ఆర్‌. శివలింగేశ్వర సాయి విజేతలుగా నిలిచారు.

85 కేజీల విభాగంలో కార్తీక్, 69 కేజీల విభాగంలో శివలింగేశ్వర సాయి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌బాబు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన వెయిట్‌ లిఫ్టర్లతో పాటు, రాష్ట్ర జూడో, బాస్కెట్‌బాల్, ఖో–ఖో బృందాలను కలిశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు.
 

మరిన్ని వార్తలు