'శుభ' సెంచరీ

29 Jan, 2020 13:24 IST|Sakshi
మూలపాడులో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 çపరుగులు చేసిన కర్ణాటక జట్టు బ్యాట్స్‌ఉమెన్‌ శుభ

పంజాబ్‌పై 118 పరుగుల తేడాతో కర్ణాటక విజయం

అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఎస్‌.శుభ,   ప్రత్యూష

విజయవాడ స్పోర్ట్స్‌: మూలపాడు, మంగళగిరిలో జరుగుతున్న బీసీసీఐ అండర్‌–23 మహిళా వన్డే సిరీస్‌లో మంగళవారం కర్ణాటక జట్టు 118 పరుగుల భారీ తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు కర్నాటక జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఎస్‌.శుభ, కె.ప్రత్యూష శుభారంభాన్ని ఇచ్చారు. శుభ సెంచరీతో (121 బంతుల్లో 18 ఫోర్లతో 113) అదరగొట్టగా, ప్రత్యూష అర్ధ సెంచరీ (59 బంతుల్లో 11 ఫోర్లతో 57 )తో చెలరేగింది. ఆ తర్వాత నికీప్రసాద్‌ (52 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) పంజాబ్‌ బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తానికి కర్నాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 273 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. పంజాబ్‌ బౌలర్లు కనికా అహుజా (3/52), ప్రియాంక కుమారి (2/33), మన్నత్‌కశ్యాప్‌ (2/56) వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ జట్టు 40.3 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది. జట్టులో రిధిమా అగర్వాల్‌ (29), శ్రీషిత్‌ (35) రాణించగా, కర్నాటక బౌలర్లు షానా ఎస్‌.పవర్‌ (3/36), సి.ప్రత్యూష (3/18), అదితి (2/16) అద్భుత బౌలింగ్‌తో పంజాబ్‌ను దెబ్బ తీశారు.

మరిన్ని వార్తలు