చాంపియన్‌ కార్తీక్‌ సాయి

16 Jul, 2019 10:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో సీహెచ్‌ కార్తీక్‌ సాయి విజేతగా నిలిచాడు. స్ఫూర్తి చెస్‌ అకాడమీ, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం 7 పాయింట్లతో కార్తీక్‌ సాయి, పి. అభినవ్, సాయ్‌పురి శ్రీథన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా కార్తీక్‌ చాంపియన్‌గా నిలవగా... అభినవ్, శ్రీథన్‌ వరుసగా రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.

చివరిదైన ఎనిమిదో రౌండ్‌లో శ్రీహిత్‌రెడ్డిపై కార్తీక్‌సాయి, విశ్వక్సేన్‌పై అభినవ్, నరేన్‌పై శ్రీథన్, సుశాంత్‌పై బషిక్‌ ఇమ్రోస్, నటురా బేతిపై సుబ్బరాజు గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్, ఉపాధ్యక్షుడు కేఏ శివ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు