దినేశ్‌ కార్తీక్‌ మెరుపులు

25 Apr, 2019 21:58 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 176 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. దినేశ్‌ కార్తీక్‌(97 నాటౌట్‌; 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసి కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ ను నిలబెట్టాడు. తొలుత నిలకడగా ఆడిన కార్తీక్‌.. ఆపై రెచ్చిపోయి ఆడాడు. క్రీజ్‌లో కుదరుకున్న తర్వాత బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా స్కోరు బోర్డుపై పరుగులేమీ చేయకుండానే క్రిస్‌ లిన్‌ వికెట్‌ను కోల్పోయింది. వరుణ్‌ అరోన్‌ వేసిన తొలి ఓవర్‌లో లిన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.  ఆపై కాసేపటికి శుభ్‌మన్‌ గిల్‌(14) కూడా వరుణ్‌ అరోన్‌ బౌలింగ్‌లోనే బౌల్డ్‌ కావడతో కేకేఆర్‌ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే నితీశ్‌ రాణా(21), సునీల్‌ నరైన్‌(11), ఆండ్రీ రసెల్‌(14)లు కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. కాగా, దినేశ్‌ కార్తీక్‌ ఒంటరి పోరాటం చేశాడు. దినేశ్‌ కార్తీక్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 175 పరుగులు చేసింది. రాజస్తాన్‌ బౌలర్లలో వరుణ్‌ అరోన్‌ రెండు వికెట్లు సాధించగా, థామస్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ లభించింది.
 

మరిన్ని వార్తలు