శ్రీలంక గెలుపు దిశగా...

18 Aug, 2019 04:48 IST|Sakshi
తిరిమన్నె, కరుణరత్నే

విజయలక్ష్యం 268

ప్రస్తుతం 133/0

గాలే: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక విజయానికి దగ్గరైంది. 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 133 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నే (71 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), తిరిమన్నె (57 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. పట్టుదలగా ఆడి అర్ధసెంచరీలు సాధించారు.  అబేధ్యమైన తొలి వికెట్‌కు 133 పరుగులు జోడించారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా చేతిలో 10 వికెట్లున్న శ్రీలంక లంచ్‌ విరామంలోపే లక్ష్యాన్ని అధిగమించే అవకాశాలున్నాయి.

అంతకుముందు 196/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు శనివారం ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 106 ఓవర్లలో 285 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు స్కోరుకు మరో 89 పరుగులు జతచేసి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ వాట్లింగ్‌ (77; 6 ఫోర్లు), సోమర్‌విల్లే (40 నాటౌట్‌; 2 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో ఎంబుల్డెనియా 4, ధనంజయ డిసిల్వా 3 వికెట్లు తీశారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యూఎస్‌ ఓపెన్‌ ఎరీనా ఇప్పుడు హాస్పిటల్‌! 

గుండుతో వార్నర్‌.... 

రోహిత్‌ విరాళం రూ. 80 లక్షలు

ధోనికంటే ‘దాదా’నే నాకు గొప్ప! 

ఐపీఎల్‌ లేకపోతే ఎలా? 

సినిమా

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

ఆ వార్తలు నిజం కాదు

ప్రజల కోసం చేసిన పాట ఇది