కశ్యప్‌ ఓటమి... ప్రణయ్‌ ముందంజ

14 Jul, 2017 01:25 IST|Sakshi
కశ్యప్‌ ఓటమి... ప్రణయ్‌ ముందంజ

కెనడా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

కాలగ్రి (కెనడా): భారత సీనియర్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ కెనడా ఓపెన్‌ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన కశ్యప్‌కు 10–21, 21–10, 15–21తో కొకి వతనబి (జపాన్‌) చేతిలో చుక్కెదురైంది. రెండో సీడ్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌తో పాటు అభిషేక్‌ యెలెగార్, కరణ్‌ రాజన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ప్రణయ్‌ 21–17, 16–21, 21–15తో కియెరన్‌ మెర్రిలీస్‌ (స్కాట్లాండ్‌)పై గెలుపొందగా, అభిషేక్‌ 21–10, 19–21, 21–17తో హోవార్డ్‌ షు (అమెరికా)ను ఓడించాడు.

కరణ్‌ రాజన్‌ 21–16, 21–14తో సామ్‌ పార్సన్స్‌ (ఇంగ్లండ్‌)పై విజయం సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా, తరుణ్‌ కోన–మేఘన జోడీలు ప్రిక్వార్టర్స్‌ చేరాయి. తొలిరౌండ్లో సిక్కిరెడ్డి జంట 21–10, 21–19తో డానియెల్‌–డానిక నిషిముర (పెరూ) ద్వయంపై, తరుణ్‌ జోడి 21–13, 22–20తో నైల్‌ యకుర–బ్రిట్నీ టామ్‌ (కెనడా) జంటపై గెలుపొందాయి. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్లో రుత్వికా శివాని 6–21, 21–9, 21–13తో గా యున్‌ కిమ్‌ (దక్షిణ కొరియా)పై గెలువగా, రీతుపర్ణా దాస్‌ 21–9, 18–21, 16–21తో హరుకో సుజుకి (జపాన్‌) చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు