సెమీస్‌లో కశ్యప్

12 Dec, 2016 14:30 IST|Sakshi
సెమీస్‌లో కశ్యప్
జెజు (కొరియా): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతోన్న ఏడో టోర్నమెంట్‌లో ఎట్టకేలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-8, 21-16తో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)పై విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ తలపడతాడు. 
 
మరిన్ని వార్తలు