ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్‌ ఓటమి

21 Apr, 2017 01:11 IST|Sakshi

చాంగ్‌జూ (చైనా): చైనా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో అతను 10–21, 22–20, 13–21తో మూడో సీడ్‌ కియావో బిన్‌ (చైనా) చేతిలో కంగుతిన్నాడు. చాలాకాలంగా గాయాలతో సతమతమైన కశ్యప్‌ ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నీ ఇది. మరో  ఆటగాడు హర్షిల్‌ డాని కూడా 17–21, 18–21తో సన్‌ ఫెక్సియాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత పోరాటం ఈ టోర్నీలో ముగిసింది.

మూడో ర్యాంకుకు సింధు
భారత బ్యాడ్మింటన్‌ సంచలనం పీవీ సింధు మూడో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని మూడో ర్యాంకుకు చేరింది. గతవారం ఐదో ర్యాంకుకు దిగజారిగన సింధు ర్యాంకు... సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో క్వార్టర్స్‌కు చేరడం ద్వారా మెరుగైంది.

మరిన్ని వార్తలు