కావ్య, నందినిలకు స్వర్ణాలు

30 Jul, 2019 10:04 IST|Sakshi

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఓపెన్‌ స్ప్రింట్స్‌ అండ్‌ జంప్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కావ్య (‘సాయ్‌’), నందిని (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి) సత్తా చాటారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం జరిగిన పోటీల్లో వీరిద్దరూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల 400మీ. పరుగును కావ్య అందరికన్నా వేగంగా 58.42 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. ‘సాయ్‌’ కేంద్రానికే చెందిన మహేశ్వరి (1ని.00.1సె.), సీహెచ్‌ పద్మశ్రీ (1ని.01.1సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. అండర్‌–16 బాలికల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో నందిని 5.21మీ. దూరం జంప్‌ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదితి సింగ్‌ (జ్యోతి విద్యాలయ) 4.07 మీ. దూకి రెండో స్థానంలో నిలవగా... పవిత్ర (సెయింట్‌ ఆన్స్‌; 4.05మీ.) మూడో స్థానాన్ని దక్కించుకుంది.  
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

 పురుషుల 400మీ. పరుగు: 1. రిషబ్‌ మిశ్రా, 2. శ్రవణ్‌ కుమార్, 3. తేజ.  
 అండర్‌–16 బాలుర లాంగ్‌ జంప్‌: 1. యోగేందర్, 2. పి. అంజి, 3. వరుణ్‌.  
 అండర్‌–14 బాలుర 4/400మీ. రిలే:
1. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, రంగారెడ్డి,
2. సీఎంఆర్, సూరారం, 3. మియాపూర్‌.
 అండర్‌–12 బాలుర 80మీ.పరుగు:
1. జె. అనిల్, 2. రామ్‌ శంకర్, 3. జి. లక్ష్మణ్‌.  
 అండర్‌–10 బాలుర 60మీ. పరుగు:
1. హృషికేశ్‌ స్వామి, 2. కె. గౌతమ్, 3. ఆర్‌. శ్రీకాంత్‌; 300మీ. పరుగు: 1. రాము,
2. ప్రణయ్, 3. గౌతమ్‌.
 అండర్‌–16 బాలికల 400మీ. పరుగు:
1. శ్రేయ, 2. విజయ లక్ష్మి, 3. ప్రవళిక.
 అండర్‌–14 బాలికల 100 మీ. పరుగు:
1. రాగవర్షిణి, 2. ఆర్‌. ఝాన్సీ బాయి, 3. సవిత; 400మీ. పరుగు: 1. ఝాన్సీ బాయి, 2. రాగవర్షిణి, 3. శరణ్య; లాంగ్‌ జంప్‌: 1. సవిత, 2. నవ్య, 3. షీరజ.
 అండర్‌–12 బాలికల 80మీ.పరుగు:
1. విభా రావు, 2. రోహిత, 3. ప్రతీకా రెడ్డి. 

మరిన్ని వార్తలు