విండీస్‌కు ఎదురుదెబ్బ

22 Aug, 2019 12:21 IST|Sakshi
మిగుల్‌ కమిన్స్‌

ఆంటిగ్వా: టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్‌ అయిన వెస్టిండీస్‌కు టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్‌ ఆల్‌ రౌండర్‌ కీమో పాల్‌ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ చీలమండ గాయంతో పాల్‌ తొలి టెస్టు నుంచి వైదొలిగినట్లు విండీస్‌ క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కీమో పాల్‌ను జట్టుతో పాటే కొనసాగిస్తున్న విండీస్‌.. రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది. కాగా, తొలి టెస్టులో పాల్‌ స్థానంలో మరొక ఫాస్ట్‌ బౌలర్‌ మిగుల్‌ కమిన్స్‌కు చోటు కల్పించింది. ఈ విషయాన్ని విండీస్‌ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

‘ గాయం కారణంగా కీమో పాల్‌ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.  అతని స్థానాన్ని మిగుల్‌ కమిన్స్‌ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాం. భారత్‌-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో కమిన్స​ ఆకట్టుకున్నాడు. మరొకవైపు నెట్స్‌లో కూడా ఎంతో పరిణిత కనబరిచాడు’ అని తెలిపింది.  మూడేళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా కమిన్స్‌ అరంగేట్రం చేశాడు. సెయింట్‌ లూసియా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కమిన్స్‌ 9 వికెట్లు సాధించాడు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ఇదే అతని కెరీర్‌ అత్యుత్తమం. సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ రోజు తొలి టెస్టు ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అచ్చం స్మిత్‌లానే..!

ధోని రికార్డుపై కోహ్లి గురి

కోహ్లి, బుమ్రాల ‘సిక్స్‌ ప్యాక్‌’పై యువీ కామెంట్‌

వేదాంత్, అబ్దుల్‌లకు రజతాలు

ఇషా, ప్రణవిలకు ‘పూజ’ అండ

సెమీస్‌లో సాయిదేదీప్య

‘పేటీఎం’కే టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌

స్మిత్‌ లేని ఆస్ట్రేలియా

భారత్‌ డబుల్‌ ధమాకా

మొదలైంది వేట

కాచుకో... విండీస్‌

‘కుంబ్లేను చీఫ్‌ సెలక్టర్‌గా చూస్తాం!’

జీవిత సత్యాన్ని చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్‌

ఓవర్‌ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్‌

కోహ్లి సేన కొత్తకొత్తగా..

భారత హాకీ జట్ల జోరు

శ్రీశాంత్‌పై నిషేధం కుదింపు

టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

మూడో టెస్టుకు స్మిత్‌ దూరం

ప్రణయ్‌ ప్రతాపం

లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌

ఆర్చర్‌ను మెచ్చుకున్న ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌

కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

ఆసీస్‌కు షాక్‌.. స్మిత్‌ దూరం

శ్రీశాంత్‌కు భారీ ఊరట

కివీస్‌ సారథిగా టిమ్‌ సౌతీ

హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

జడేజా ముంగిట అరుదైన రికార్డు

నన్ను క్షమించండి:  పాక్‌ క్రికెటర్‌

ఫైనల్‌కు కార్తీక వర్ష, నందిని 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చందమామతో బన్నీ చిందులు

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం