కీర్తన, ప్రేమ్‌కుమార్‌లకు స్వర్ణాలు

13 Oct, 2018 10:42 IST|Sakshi

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఓపెన్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కీర్తన, ప్రేమ్‌ కుమార్‌ విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ టోర్నీలో అండర్‌–14 బాలికల షాట్‌పుట్‌లో కీర్తన, అండర్‌–16 బాలుర లాంగ్‌జంప్‌లో ప్రేమ్‌ కుమార్‌ స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో వరంగల్‌కు చెందిన ప్రేమ్‌ కుమార్‌ 5.92మీ. దూరం జంప్‌ చేసి విజేతగా నిలిచాడు. జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన అథ్లెట్‌ ఎం. రేవంత్‌ (5.85మీ.), అబిద్‌ ఖురేషి (రంగారెడ్డి, 5.85మీ.) వరుసగా రజత కాంస్యాలను సొంతం చేసుకున్నారు. అండర్‌–14 బాలికల షాట్‌పుట్‌లో వీఎస్‌ఎస్‌ కీర్తన్‌ గుండును అందరికంటే దూరంగా 9.44మీ. దూరం విసిరి చాంపియన్‌గా నిలిచింది. తేజస్విని (మంచిర్యాల, 8.78మీ.), అనీశ్‌ కుమార్‌ (‘సాయ్‌’, 8.10మీ.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో గచ్చిబౌలి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌. శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి ప్రొఫెసర్‌ కె. రంగారావు, హైదరాబాద్‌ జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్‌ రాజేశ్‌ కుమార్, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బికాస్‌ కరార్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
∙అండర్‌–20 బాలికల 100మీ. పరుగు: 1. నిత్య (12.5సె., హైదరాబాద్‌), 2. భానుచంద్రిక (13.4 సె., సాయ్‌), 3. రమ (13.8 సె., వికారాబాద్‌).
∙400మీ. పరుగు బాలికలు: 1. పి. కావ్య (సాయ్‌), 2. అనురాగ (వికారాబాద్‌), 3. కె. మంజుల (మహబూబ్‌నగర్‌).
∙షాట్‌పుట్‌ బాలికలు: 1. కె. మాన్విత (భద్రాద్రి), 2. టి. అనూష (భద్రాద్రి), 3. ఆర్‌. శ్రీలత (నిజామాబాద్‌); బాలురు:  1. యశ్వంత్‌ (వరంగల్‌ అర్బన్‌), 2. అలెక్స్‌ జోసెఫ్‌ (వికారాబాద్‌), 3. హెచ్‌. సునీల్‌ (నిజామాబాద్‌).

∙లాంగ్‌జంప్‌ బాలురు:  1. ప్రసన్న కుమార్‌ (సూర్యాపేట్‌), 2. ఖాసిమ్‌ షరీఫ్‌ (హైదరాబాద్‌), 3. జి. సైదులు (యాదాద్రి).
∙డిస్కస్‌ త్రో బాలురు: 1. అనిల్‌ నాయక్‌ (నిజామాబాద్‌), 2. అలెక్స్‌ జోసెఫ్‌ (వికారాబాద్‌), 3. సునీల్‌ (నిజామాబాద్‌)  
∙అండర్‌–18 బాలికల 400మీ. పరుగు: 1. సుష్మా బాయి (సాయ్‌), 2. టి. హనీ (మంచిర్యాల), 3. పి. మౌనిక (నల్లగొండ).
∙షాట్‌ఫుట్‌: 1. తేజస్విని (హైదరాబాద్‌), 2. సు జిత (మంచిర్యాల), 3. సంధ్య (మహబూబాబాద్‌).  
∙లాంగ్‌జంప్‌ బాలురు: 1. అనురాగ్‌ (బీఎస్‌సీ), 2. బి. జగదీశ్‌ (వరంగల్‌), 3. తేజ (మెదక్‌).
∙ డిస్కస్‌ త్రో బాలురు: 1. అభిషేక్‌ (బీఎస్‌సీ), 2. రాజు (వికారాబాద్‌), 3.రాఘవేంద్ర (కరీంనగర్‌).  
∙10,000 మీ. రేస్‌వాక్‌: 1. దుర్గారావు (వరంగల్‌ అర్బన్‌), 2. ఎస్‌. అజయ్‌ (ఆదిలాబాద్‌), 3. బి. కుమార్‌ (మహబూబాబాద్‌).
∙అండర్‌–16 బాలికల షాట్‌పుట్‌: 1. ఆర్‌. సుజంత (నాగర్‌కర్నూల్‌), 2. కావ్య (నల్లగొండ), 3. ఎం. సాయి వర్షిత (మంచిర్యాల).
∙డిస్కస్‌ త్రో బాలురు: 1. అజయ్‌ (బీఎస్‌సీ), 2. మన్‌దీప్‌ (బీఎస్‌సీ), 3. విశాల్‌ (వికారాబాద్‌).
∙500మీ. రేస్‌ వాక్‌: 1. ప్రిన్స్‌ (బీఎస్‌సీ), 2. భా స్కర్‌ (మంచిర్యాల), 3. రంజిత్‌ (వరంగల్‌).

మరిన్ని వార్తలు