‘క్రికెటే కాదు.. ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాం’

16 Jun, 2018 17:12 IST|Sakshi

కొచ్చి, కేరళ : ‘ఇండియా అంటే క్రికెట్‌.. క్రికెట్‌ అంటే ఇండియా’. ఇన్నాళ్లు ఇవే పరిస్థితులు కనిపించేవి మన దేశంలో. కానీ ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.  ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు ‘సాకర్‌’.. ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌. ఈ విశ్వ క్రీడకు ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఆదరణ పెరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా కేరళ కొచ్చికి చెందిన ఒక ఆరుగురు యువకులు ఫుట్‌బాల్‌ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు మలయాళంలో ఒక పెప్పి థీమ్‌ సాంగ్‌ను కంపోస్‌ చేశారు.

ఇంటర్నెట్‌లో విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు ఫుట్‌బాల్‌ అభిమానులను ఊపేస్తుంది. ఈ విషయం గురించి  సరత్‌ మోహన్‌(పాటకు సంగీత దర్శకుడు)... ‘ఫుట్‌బాల్‌ అంటే మాకు చాలా ఇఫ్టం. ఫుట్‌బాల్‌ పట్ల మాకున్న ప్రేమను చాటుకోవడనికి నేను నా స్నేహితులు కలిసి ఈ పాటను రూపొందించాం. ఈ పాటను కేరళ ఫుట్‌బాల్‌ అభిమానులకు అంకితం ఇస్తున్నాం’ అని  తెలిపారు. అంతేకాక తాము అర్జెంటినా అభిమానులమని, ఈ ఏడాది ఆ టీమే కప్పు కొడుతుందని భావిస్తున్నామన్నారు. సరత్‌ మోహన్‌, దేవకృష్ణ, సుజాత పాడిన ఈ పాటను ‘షీ మీడియాస్‌’ బ్యానర్‌లో విడుదల చేశారు. 

కేరళను ఊపేస్తున్న వీడియో ఇదే..

మరిన్ని వార్తలు