61 ఏళ్ల తర్వాత రెండో బౌలర్‌గా..

21 Jul, 2018 14:11 IST|Sakshi
కేశవ్‌ మహరాజ్‌

కొలంబో : దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ సఫారీ స్పిన్నర్‌ 9 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 61 ఏళ్ల అనంతరం ఈ రికార్డును కేశవ్‌ అందుకోవడం విశేషమైతే.. లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం.

1957లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆఫ్‌ స్పిన్నర్‌ హగ్‌ టైఫీల్డ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హగ్‌ టైఫీల్డ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. తాజాగా కేశవ్‌ ఈ రికార్డును సమం చేశాడు. గతంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో జేసీ లేకర్‌ (ఇంగ్లండ్‌), అనిల్‌ కుంబ్లే (భారత్‌)లు పది వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 

కేశవ్‌ దెబ్బకు శ్రీలంక 338 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన సఫారీ జట్టు సైతం 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పోరాడుతుంది. 

మరిన్ని వార్తలు