అండర్సన్‌కు చుక్కెదురు

6 Jul, 2019 03:19 IST|Sakshi
అండర్సన్‌

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. పదోసీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) కూడా పరాజయం చవిచూడగా, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రావ్‌నిచ్‌ (కెనడా) ప్రిక్వార్టర్స్‌ చేరాడు.  దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు నాలుగో సీడ్‌ అండర్సన్‌ 4–6, 3–6, 6–7 (4/7)తో 26వ సీడ్‌ పెల్లా చేతిలో కంగుతిన్నాడు.

మిగతా మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 7–5, 6–7 (5/7), 6–1, 6–4తో హుర్కాజ్‌ (పోలాండ్‌)పై, 15వ సీడ్‌  రావ్‌నిచ్‌ (కెనడా) 7–6 (7/1), 6–2, 6–1తో రెలీ ఒపెల్కా (అమెరికా)పై గెలుపొందారు. పదో సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) 3–6, 6–7 (3/7), 1–6 స్పెయిన్‌కు చెందిన 23వ సీడ్‌ అగుట్‌ చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 6–3, 6–1తో  అజరెంకా (బెలారస్‌)పై, మూడో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 2–6, 6–4తో సు వే హై (చైనీస్‌ తైపీ)పై, 8వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–3, 6–7 (1/7), 6–2తో  సక్కారి (గ్రీస్‌)పై గెలిచారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా