పీటర్సన్కు జరిమానా

3 Feb, 2017 17:47 IST|Sakshi
పీటర్సన్కు జరిమానా

మెల్బోర్న్:బిగ్బాష్ బాష్ లీగ్(బీబీఎల్)లో అంపైర్  నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, మెల్బోర్న్ స్టార్స్  క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పై జరిమానా పడింది. గత వారం పెర్త్ స్కాచర్స్ -మెల్బోర్న్ స్టార్స్ల మధ్య  సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కాచర్స్ ఆటగాడు సామ్ వైట్మన్ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి బ్యాట్కు తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనబడింది. అయితే మెల్ బోర్న్ ఆటగాళ్ల అప్పీల్ను ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

 

కాగా, అదే సమయంలో  మైక్రోఫోన్లో బీబీఎల్ వ్యాఖ్యాతలతో మాట్లాడుతున్న పీటర్సన్.. అంపైర్ నిర్ణయంపై ధ్వజమెత్తాడు. అది కచ్చింతగా తప్పుడు నిర్ణయమంటూ వేలెత్తి చూపాడు. ఆ బంతి గ్లౌవ్స్ కు తాకి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేశాడు.  అంపైర్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో పీటర్సన్కు జరిమానా విధించారు. ఐసీసీ నిబంధనల్లోని లెవన్ -2ను పీటర్సన్ అతిక్రమించడంతో అతనిపై ఐదు వేల ఆస్ట్రేలియా డాలర్లను జరిమానా విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు