'ఎంతిచ్చినా ఆడే ప్రసక్తే లేదు'

2 Mar, 2017 17:01 IST|Sakshi
'ఎంతిచ్చినా ఆడే ప్రసక్తే లేదు'

లాహోర్:భద్రత కారణాల రీత్యా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎఎస్ఎల్) ఫైనల్ మ్యాచ్ వేదికైన లాహోర్ లో ఆడటానికి ఇంగ్లండ్ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, తైమాల్ మిల్స్, ల్యూక్ రైట్  లు విముఖత వ్యక్తం చేశారు. వీరికి భారీ మొత్తంలో బోనస్ ఇవ్వడానికి  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) యత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.  తమకు ఎంతమొత్తం ఇచ్చినప్పటికీ వరుస దాడులు జరిగే లాహోర్ లో ఆడబోమని తేల్చిచెప్పారు. 

పీఎస్ఎల్ ఫైనల్ మ్యాచ్ ను లాహోర్ లో నిర్వహించడం ద్వారా అక్కడ ఎటువంటి భద్రతపరమైన ఇబ్బంది లేదని ప్రపంచానికి చాటి చెప్పడమే పీసీబీ ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే పలువురు ప్రధాన క్రికెటర్లకు పది వేల యూఎస్ డాలర్ల నుంచి యాభై వేల యూఎస్ డాలర్లను ఇవ్వడానికి పీసీబీ ముందుకొచ్చింది. దీనిలో భాగంగా ముగ్గురు ఇంగ్లిష్ క్రికెటర్లకు భారీగా బోనస్ ఆఫర్ చేసింది పీసీబీ. అయితే ఆ బోనస్ తమకు అక్కర్లేదని వారు స్పష్టం చేయగా, మరికొంతమంది స్టార్ క్రికెటర్లకు కూడా పీసీబీ ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఫైనల్ మ్యాచ్ కు ఎక్కువ సంఖ్యలో ప్రముఖ క్రికెటర్లు డుమ్మా కొడితే అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బే,.
 

>
మరిన్ని వార్తలు