క్వార్టర్స్కు శ్రీకాంత్

21 Sep, 2017 13:28 IST|Sakshi
క్వార్టర్స్కు శ్రీకాంత్

టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో శ్రీకాంత్ 21-12,21-11 తేడాతో హు యున్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్లోకి చేరాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో గేమ్ ను కూడా అదే ఊపులో సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.  ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ ఎటువంటి పొరపాట్లు చేయకుండా హు యున్ ను మట్టికరిపించాడు. శ్రీకాంత్ తన తదుపరి పోరులో డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్తో తలపడతాడు.

మరో పురుషుల సింగిల్స్ లో భారత్ కు చెందిన మరో ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ కు చేరాడు.  ప్రిక్వార్టర్స్ లో ప్రణయ్ 21-16,23-21 తేడాతో సు జెన్‌ హావో (చైనీస్‌ తైపీ)పై గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నాడు. తొలి గేమ్ ను శ్రమించి సొంతం చేసుకున్న ప్రణయ్ కు రెండో గేమ్ లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు.. అయితే  కడవరకూ పోరాటాన్ని కొనసాగించిన ప్రణయ్ 23-21 తేడాతో గేమ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా మ్యాచ్ ను కూడా సాధించాడు. ఇదిలా ఉంచితే, సమీర్ వర్మ పోరాటం మాత్రం ప్రిక్వార్టర్స్ లోనే ముగిసింది. ప్రిక్వార్టర్స్ లో సమీర్ వర్మ 21-10,17-21,15-21 తేడాతో షి యుకి (చైనా) చేతిలో ఓటమి పాలైయ్యాడు. తొలి గేమ్ ను సునాయాసంగా సాధించినప్పటికీ, మిగతా రెండు గేమ్ ల్లో సమీర్ విఫలమయ్యాడు.

మరిన్ని వార్తలు