లుంగి ఎంగిడి విజృంభణ

20 May, 2018 21:54 IST|Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. 16 పరుగులకే క్రిస్‌ గేల్‌(0), అరోన్‌ ఫించ్‌(4), కేఎల్‌ రాహుల్‌(7) వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో మిల్లర్‌తో కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత మనోజ్‌ తివారీ(35) పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో డేవిడ్‌ మిల్లర్‌(24) సైతం ఔట్‌ కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ 80 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.

అటు తర్వాత స్వల్ప విరామాల్లో కింగ్స్‌ పంజాబ్‌ వికెట్లను చేజార్చుకుంది. కాగా, కరుణ్‌ నాయర్‌(54; 26 బంతుల్లో 3 ఫోర్లు, 5సిక్సర్లు) ఆదుకున్నాడు. దాంతో కింగ్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.

చెన్నై పేసర్‌ లుంగి ఎంగిడి.. కింగ్స్‌ పంజాబ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో 1 మెయిడిన్‌ సాయంతో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌, బ్రేవోలు తలో రెండు వికెట్లు తీయగా, జడేజా, చాహర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు