మూడో వన్డేలో కివీస్ గెలుపు

15 Jun, 2015 01:56 IST|Sakshi
మూడో వన్డేలో కివీస్ గెలుపు

విలియమ్సన్, రాస్ టేలర్ సెంచరీలు

 సౌతాంప్టన్ : రాస్ టేలర్ (123 బంతుల్లో 110; 12 ఫోర్లు) వరుసగా రెండో సెంచరీకి తోడు..  విలియమ్సన్ (113 బంతుల్లో 118; 12 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం బాదడంతో న్యూజిలాండ్‌కు మరో విజయం దక్కింది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. ఆదివారం ది రోజ్ బౌల్ మైదానంలో జరిగినమూడో వన్డేలో ఆల్‌రౌండ్ షో చూపిన కివీస్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మోర్గాన్ (82 బంతుల్లో 71; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), స్టోక్స్ (47 బంతుల్లో 68; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), వేగంగా ఆడారు.

సౌతీ, వీలర్‌లకు మూడేసి వికెట్లు, హెన్రీకి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన కివీస్ 49 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌కు చేరినా విలియమ్సన్, టేలర్ జోడి ఇంగ్లండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. విలియమ్సన్ 88 బంతుల్లో.. టేలర్ 105 బంతుల్లో సెంచరీలు చేశారు. వీరి జోరుతో మూడో వికెట్‌కు 206 పరుగుల భారీ భాగస్వామ్యం చేరింది. విల్లేకు మూడు, స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. నాలుగో వన్డే ఈనెల 17న జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు