రాహుల్‌ టైమ్‌ వచ్చింది.. ధోనిలా ట్రైచేయ్‌!

25 Apr, 2020 13:55 IST|Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా  హెయిర్‌ డ్రెస్సర్స్‌ మూతపడిపోవడంతో ‘కటింగ్‌’కు పెద్ద ఇబ్బందే వచ్చిపడింది. ఇప్పటికే మీసాలు, గడ్డాలతో పాటు హెయిర్‌ కూడా పెరిగిపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం హెయిర్‌ స్టైల్స్‌ షాపులకు ఆంక్షల సడలింపు ఇస్తే బాగుంటుందన్న వారు కూడా అధికంగానే ఉన్నారు. మీసాలు, గడ్డాలు అయితే మనమే షేవ్‌ చేసుకోవచ్చు. కానీ జట్టును కత్తిరించుకోవాలంటే హెయిర్‌ కటింగ్‌ షాపుకైనా వెళ్లాలి.. లేకపోతే బార్బర్‌ మీ ఇంటికైనా రావాలి. మరి ఈ లాక్‌డౌన్‌తో ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌ అన్నట్లుగా ఉండటంతో కటింగ్‌ మాటే మర్చిపోవాలేమో. (భార్య ‘చేతి’లో బుక్కైపోయాడు..!)

బార్బర్‌ షాపులకు ఇప్పట్లో సడలింపు ఇచ్చే ఆలోచనలు లేకపోవడంతో జట్టును పెంచుకోవడం ఒక సులభమైన మార్గమైతే, మనమే సొంతంగా కొత్త లుక్‌ను ట్రై చేయడం కష్టమైన మార్గం. ఇలా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కొత్త స్టైల్‌ను ట్రై చేశాడు. కాకపోతే ఇక్కడ కోహ్లి భార్య అనుష్క శర్మ సాయం చేయడంతో ఆ ట్రిమ్మర్‌ కటింగ్‌ కోహ్లికి సరికొత్త లుక్‌ను తెచ్చిపెట్టింది. ఇక్కడ మరో టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పరిస్థితి భిన్నం.  అసలు జట్టును ఏదొలా కట్‌ చేసుకుని న్యూలుక్‌ను ట్రై చేయాలా.. లేక జట్టును పెంచుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. దీనిపై తనకు క్లారిటీ కావాలంటూ ట్వీటర్‌లో అభిమానులను అడిగేశాడు రాహుల్‌ .  అయితే రాహుల్‌ క్వశ్చన్‌కు సమాధానాలు భిన్నంగా వస్తున్నాయి. 

‘ రాహుల్‌.. నిన్ను ధోనిలా చూడాలనుకుంటున్నా. ఒక్కసారైనా ధోనిలా పొడవాటి జులపాలు పెంచు బ్రో’ అని ఒకరు ట్వీట్‌ చేయగా, ‘ జట్టు బాగా పెంచి తలపాగాతో కొత్తగా ట్రై చేయి‌’ అని మరొకరు సమాధానం ఇచ్చారు. ‘ ఈ విషయాన్ని మీ గర్ల్‌ఫ్రండ్‌ అతియా శెట్టిని అడిగితే పోలా’ అని మరొకరు జవాబిచ్చారు. ‘ అరే రాహుల్‌.. టైమ్‌ వేస్ట్‌ చేయకురా నాయనా.. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తొందరగా తీసుకురా’ అని మరొకరు జోక్‌ చేశారు.

మరిన్ని వార్తలు