చొక్కా ఎక్స్‌చేంజ్ చేసుకున్నారా?

10 Apr, 2020 15:10 IST|Sakshi

టీమిండియా ఆట‌గాడు కేఎల్ రాహుల్‌, బాలీవుడ్ న‌టి అతియా శెట్టి మ‌ధ్య ప్రేమాయ‌ణం గురించి దాదాపు ఏడాది నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక‌రి పుట్టిన‌రోజుకు మ‌రొక‌రు విషెస్ చెప్పుకోవ‌డం, డిన్న‌ర్ డేట్‌కు వెళ్లి మీడియా కెమెరాల‌కు చిక్క‌డం, బీచ్‌లో ఎంజాయ్ చేయ‌డం, త‌ర్వాతి కాలంలో క‌లిసి ఉన్న ఫొటోలను షేర్ చేయ‌డం వంటివి వీరి ప్రేమ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్నిచ్చాయి. కాగా లాక్‌డౌన్ వేళ బ్యూటీ అతియా శెట్టి కొన్ని హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. దీనికి ఫిదా అయిన రాహుల్ "నైస్ ష‌ర్ట్" అని మెచ్చుకున్నాడు. గ‌ల్లీబాయ్ స్టార్ సిద్ధాంత్ చ‌తుర్వేది చిచ్చు రేపుతున్నావు అని అర్థం వ‌చ్చేలా ఫైర్ ఎమోజీ పెట్టాడు. (బీచ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న లవ్ బర్డ్స్!)

"రాహుల్‌, అతియా చొక్కాలేమైనా మార్చుకున్నారా?" అని ఓ నెటిజ‌న్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇదిలా ఉండ‌గా అతియా తండ్రి, న‌టుడు సునీల్ శెట్టి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తన కొడుకు అహాన్ ప్రేమిస్తున్న అమ్మాయి త‌న‌కూ ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు. అలాగే అతియా ఎవ‌రినైతే ఇష్ట‌ప‌డుతుందో.. అత‌నంటే కూడా త‌మకిష్ట‌మేనన్నాడు. ఈ విష‌యంలో త‌న‌కు గానీ, త‌న భార్య మ‌నాకు గానీ ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. పైగా వారి సంతోషమే క‌దా మాక్కావాల్సిందని చెప్పుకొచ్చాడు. (వీరిద్దరి ప్రేమాయాణం నిజమేనా?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా